ఎ9 న్యూస్ డెస్క్, హైదరాబాద్ ,అక్టోబర్ 19:
అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ అధ్యక్షులు కంచరి బ్రహ్మం మాట్లాడుతూ
నిజామాబాద్ పట్టణంలో నిన్న శనివారం నాడు ఒక కేసు విషయంలో పోలీసులు నేరస్తుల్ని పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్తున్న సమయంలో కానిస్టేబుల్ పై ఒక నేరస్తుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. సమాజంలో పెరుగుతున్న నేరాల సంఖ్య అరికట్టేందుకు పోలీసులకే రక్షణ లేకుండా పోయింది.
వెంటనే తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం స్పందించి కానిస్టేబుల్ పై దాడి చేసి చంపి న వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.








