మిర్ధపల్లి లో నూతన తరగతుల ప్రారంభం….
ఆలూర్ మండలం మిర్ధపల్లి గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో నూతనంగా మంజూరైన ప్రీ–ప్రైమరీ తరగతులను ఎంపీడీఓ గంగాధర్, ఎంఈఓ నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్ధపల్లి ఎంపీపీఎస్ పాఠశాల జిల్లా స్థాయిలో మంచి పేరు పొందిన పాఠశాలగా గుర్తింపు పొందిందని, ఇప్పుడు ప్రభుత్వ నుంచి ప్రీ–ప్రైమరీ తరగతులు మంజూరు కావడం అభినందనీయమని అన్నారు.
ఈ అవకాశాన్ని పాఠశాల సిబ్బంది సమర్థవంతంగా వినియోగించుకుని విద్యార్థులతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు తయారు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వస్తువులను అధికారులు మరియు పాఠశాల యాజమాన్యం తిలకించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పాఠశాలలో పిల్లలు తయారు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌ను తిలకిస్తున్న ఎంపీడీఓ, ఎంఈఓ.








