పెట్రేగుతున్న విడిసి ఆగడాలు – ఆదివాసీ నేత రామచందర్ ఆవేదన….

On: Tuesday, November 4, 2025 7:07 AM

 

A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిర్యాల్ గ్రామంలో విడిసి సభ్యుల ఆగడాలు మితిమీరుతున్నాయని సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గాండ్ల రామచందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం ఆర్మూర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామంలోని 48 నాయకపోడు కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన ఐదున్నర ఎకరాల అసైన్మెంట్ భూమిపై విడిసి సభ్యులు అధికారం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

పట్టాలు, పాస్‌బుక్కులు ఉన్న భూములను “ప్రభుత్వ భూమి” అంటూ బెదిరింపులు ఇస్తున్నారని ఆరోపించారు. భీమన్న ఉత్సవాల సమయంలో కూడా విడిసి సభ్యులు జోక్యం చేసుకోవడం అన్యాయం అని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ అయ్యా, పుట్ట దేవేందర్, చంటి శ్రీనివాస్, బంటు లింగం, బొంత గోపి, బొంత నాగన్న తదితరులు పాల్గొన్నారు.

11 Nov 2025

Leave a Comment