బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ.
ఎ9 న్యూస్, మెదక్, అక్టోబర్ 19 :
నిజాంబాద్ జిల్లా అర్బన్ లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎవరైతే రౌడీ మూకలు ఈ హత్య వెనుక ఉన్నాయో వారిని వెంటనే శిక్షించాలని జిల్లా సీపీ ని కోరడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పట్ల సానుభూతి తెలియజేస్తూనే, దానికి కారకులైన వారిని శిక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూనే వారికి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అలాగే ఈరోజు సారంగాపూర్ శివారులో హత్యకు కారకుడైన రియాజ్ ను పట్టుకుపోయిన మరో కానిస్టేబుల్ పై హత్యాయత్నం చేసి పారిపోతున్న సమయంలో ఆసిఫ్ అనే యువకుడు ధైర్య సాహసాలతో ఆయన్ని పట్టుకునే సమయంలో ఆయన ఎడమ చేతిపై కూడా గాయం చేశాడు నిందితుడు ఇలాంటి క్రూర మృగాలను కఠినమైన శిక్ష అమలు చేసి ఉరితీయాలని చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిని ఉపేక్షించకుండా ఏ పార్టీ వాడైనా ఎవరి అండదండలు ఉన్న ఎవరికీ తలొగ్గకుండా చట్టం తన పని తాను చేసుకోవాలని ఈ సందర్భంగా హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆ భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఇట్టి సందర్భంగా థోండి రమణ తెలిపారు.








