ప్రజాసేవకు సిద్ధమైన ఆ మందు భోజరాం …

On: Saturday, December 13, 2025 3:45 AM

 

“షాపూర్ ప్రజలందరి ఆశీస్సులు కావాలి “…..

షాపూర్ గ్రామాన్ని నిజామాబాద్ జిల్లాలో ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తానని హామీ .

బడుగు, బలహీన వర్గాలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా అందేలా చర్యలు.

రేషన్ కార్డులు, పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు అర్హులైన వారికి సకాలంలో అందేలా ప్రత్యేక దృష్టిపెడుతానని

నిరుపేదలకు ఇళ్లు – ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్‌రూం పథకాలకు ప్రాధాన్యతతో పాటు మంచినీటి సమస్యలు, డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం,విద్యా–వైద్య రంగాలను బలోపేతం చేసే కార్యక్రమాలు .యువత చెడు వ్యసనాల నుండి దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు, ప్రోత్సాహం.గ్రామాన్ని సుందరీకరణతో పాటు సర్వాంగ అభివృద్ధి దిశగా నడిపించడం.అదేక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి అండతో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగంగా షాపూర్ గ్రామానికి తగిన నిధులు తీసుకురావడానికి వినయ్ రెడ్డి సహాయ–సహకారాలు ఎల్లప్పుడూ పొందుతానని భోజరాం హామీ ఇచ్చారు.

చిన్న–పెద్ద తేడా లేకుండా అందరికీ సమాన సేవ అందిస్తానని, గ్రామాన్ని అన్ని గ్రామాలకు ఆదర్శంగా మార్చే బాధ్యత తనదేనని పేర్కొన్నారు.

“షాపూర్ ప్రజలందరి ఆశీస్సులు కోరుకుంటున్నాను… కత్తెర గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి” అని పాదాభివందనాలతో విజ్ఞప్తి చేశారు.

18 Jan 2026

Leave a Comment