నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – నిజామాబాద్ జిల్లా తరపున.
ఆర్మూర్, సెప్టెంబర్ 8:
ఆర్మూర్ పట్టణంలో గణేష్ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతియుతంగా, విజయవంతంగా పూర్తవ్వడాన్ని గౌరవనీయంగా గుర్తిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించడంలో మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, పోలీస్ శాఖలతో పాటు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది చూపిన బాధ్యతాయుతమైన సేవకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ – నిజామాబాద్ జిల్లా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ప్రజలు స్వేచ్ఛగా, భద్రతగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవడంలో నిమగ్నమైన ప్రతి అధికారికి ప్రత్యేక అభినందనలు. రాబోయే ప్రతి ఉత్సవం కూడా ఇదే విధంగా శాంతియుతంగా, సమన్వయంతో జరిగేలా ప్రతి శాఖ మధ్య సమర్థవంతమైన సహకారం కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాము.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు షేక్ అనీఫ్ గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ గారు పాల్గొన్నారు.







