అక్టోబర్ 25: తెలంగాణ మద్యం టెండర్లపై దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ ఐదుగురు మద్యం వ్యాపారులు హైకోర్టులో వేసిన పిటిషన్ పై శనివారం న్యాయమూర్తి ఎన్ తుకారంజీ విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈనెల 18 నుంచి 23 వరకు రూ.5వేల దరఖాస్తులే వచ్చాయని.. గడువు పొడిగించడం ప్రభుత్వ విధానపరమైన అంశమని ఏఏజీ కోర్టుకు తెలిపారు.
తెలంగాణలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో బీసీ బంద్, బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడవును ఈనెల 23 వరకు పొడిగించింది. తాజాగా, మరింత గడువు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టును ఆశ్రయించింది..








