తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది.
జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్లుగా నియమించింది. 1927 అటవీ చట్టం ప్రకారం అటవీ భూముల హక్కులు, అటవీ ప్రాంతాల నిర్దారణ విధులను ఇప్పుడు ఈ అదనపు కలెక్టర్లు నిర్వహించనున్నారు.
ఇది రాష్ట్ర అటవీ పరిపాలనలో పెద్ద మార్పుగా భావించబడుతోంది.








