తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఆస్పత్రుల్లో ‘హెల్త్‌ ఏటీఎం’ల ఏర్పాటు….

On: Tuesday, October 21, 2025 10:52 AM

 

Oct 21, 2025,

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. ఆస్పత్రుల్లో ‘హెల్త్‌ ఏటీఎం’ల ఏర్పాటు

పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ‘హెల్త్‌ ఏటీఎం’లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి ఆస్పత్రి, మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో వీటిని ఏర్పాటు చేశారు. వీటి సేవలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ హెల్త్‌ ఏటీఎంలు శరీరాన్ని స్కాన్‌ చేయడం, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు (బీపీ), రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి వంటి మొత్తం 132 రకాల పరీక్షల ఫలితాలను నిమిషాల్లోనే అందిస్తాయి. అలాగే రోగి ఆరోగ్య రికార్డును డిజిటల్‌గా చేయనుంది.

11 Nov 2025

Leave a Comment