ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం…..

On: Tuesday, November 4, 2025 5:29 PM

 

Nov 04, 2025,

తెలంగాణ : ఆదిలాబాద్‌లో విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సమర్పించిన నివేదిక ఆధారంగా, ప్రభుత్వం ఆదిలాబాద్ కలెక్టర్‌ను భూసేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ప్రాజెక్ట్ ఉత్తర తెలంగాణలో కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు పర్యాటకాన్ని, పారిశ్రామిక వృద్ధిని పెంచుతుందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో 3 కి.మీ రన్‌వే, పౌర టెర్మినల్, భారత వైమానిక దళం స్టేషన్ ఉంటాయి.

11 Nov 2025

Leave a Comment