హైదరాబాద్: ఆగస్టు 16*
తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం ఉంది ఏపీ, తెలంగాణ,వాతావరణం శాఖ ఇప్పటికే అలర్ట్ చేసింది, రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని, వాతావరణ శాఖ వెల్లడించింది, ఉపరితల చక్రవాత ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని..
ఆగస్టు 16 నుంచి 19 వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ వాతావరణ శాఖ తెలి పింది. ఇవాళ జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ బాద్, ములుగు భద్రాద్రి కొత్తగూడెం, అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.
రేపు ఆదివారం అదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, హన్మకొండ, వరంగల్, మహబూబ్ బాద్, ములుగు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ఎరుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది.
*జిల్లాలోని అధికారులు అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి.
భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతా ధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉంచాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించా లని సూచించారు.
వాగులు పొంగే ప్రమాద మున్న జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న ఆయన లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ఆదేశించా రు.రాష్ట్రంలోని జలాశ యాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని, ప్రాణ, ఆస్తి, పశు నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేలా వ్యవహరించాలన్నారు.
వివిధ ప్రాజెక్టులు, రిజర్వా యర్ల నీటి విడుదలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి ముందస్తు సమాచారం ఇవ్వాలని, పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నీరు నిలిచిన వంతెనలు, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, నగర, పురపాలక, గ్రామ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అన్నారు.








