గుండ్రెడ్డిపల్లి లో విజయవంతంగా ఉచిత పశు వైద్య శిబిరం.
ఎ9 న్యూస్ తూప్రాన్ నవంబర్, 4.
పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు. మంగళవారం ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్స్ 320 డి డిస్ట్రిక్ట్ సెక్రెటరీ ఫర్ వెటర్నరీ క్యాంప్స్ లయన్ డాక్టర్ లింగమూర్తి జన్మదినం సందర్భంగా గుండ్రెడ్డిపల్లి లో ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ తాడురీ కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మేఘా పశు వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు శుభ్రమైన నీరు అందించడం, పచ్చి మేత ఇవ్వడం, వేడి వాతావరణంలో నీడ కల్పించడం, వ్యాధులను నివారించడానికి టీకాలు వేయించడం, మరియు వ్యాధులు సోకితే వెంటనే ఇతర ఆరోగ్యకరమైన పశువుల నుండి వేరుచేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. పశు సంరక్షణ అనేది ప్రతి రైతు బాధ్యత అని పశువుల గురించి రైతు కుటుంబాలు పూర్తి అవగాహనతో ఉండి పశువుల ఆరోగ్యాన్ని కాపాడాలని అన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ సిద్దిపేట రీజియన్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్త మాట్లాడుతూ నేటి బర్త్ డే బాయ్ డిస్ట్రిక్ట్ సెక్రెటరీ లయన్ డాక్టర్ లింగమూర్తి తన జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 5వ తేదీన తన ఒక నెల జీతం డబ్బులు హెచ్చించి పశువులకు బల సంవర్ధక మందులు రైతులకు అందించి వాటిని ఎలా ఎప్పుడూ ఉపయోగించాలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం తూప్రాన్ సీనియర్ పశు వైద్య అధికారి డాక్టర్ లక్ష్మీశ్రీ మాట్లాడుతూ పశువులను పెంచడం తోపాటు వాటి సంరక్షణ అనేది చాలా ముఖ్యమైన పాత్ర అని అన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యుడిని సంప్రదించాలనీ సూచించారు. అనంతరం తూప్రాన్ లయన్స్ క్లబ్ లీడర్ షిప్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజు మాట్లాడుతూ పశువులకు ఎల్లప్పుడూ శుభ్రమైన, స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉంచాలన్నారు. నీటి తొట్టెలను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. పశువులకు పచ్చి మేతతో పాటు ఎండు మేత కలిపి అందించాలన్నారు. ప్రతిరోజూ పశువులకు అవసరమైన మొత్తంలో దాణా ఇవ్వాలన్నారు. పశువులకు అవసరమైన వ్యాక్సిన్లు, టీకాలు సకాలంలో వేయించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ తిరుపతి, ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ తాడురి కృష్ణారెడ్డి, రీజియన్ చైర్మన్ లయన్ సంజయ్ గుప్త, రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గుప్త, జోన్ చైర్మన్ లయన్ ఆకుల సుఖేందర్, లీడర్ షిప్ చైర్మన్ లయన్ బుడ్డ భాగ్యరాజు, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్, చేగుంట లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ శంభుని శ్రీనివాస్, సెక్రెటరీ నాగరాజు, లయన్ బ్రహ్మచారి, లయన్ సంజీవ్, లయన్ రామచంద్రం, లయన్ నాగరాజు, లయన్ రవి, పశు వైద్య సిబ్బంది రాజిరెడ్డి, రవి, చిరంజీవి, రామస్వామి, అశోక్, రమేష్, కృష్ణ, రామకృష్ణ, నిషారొద్ధిన్, శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.








