ముప్కాల్, సెప్టెంబర్ 6:
ముప్కాల్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద తాడూరి సిద్ధ రమేష్ గారి షట్టర్ రూములో శ్రీ శ్రీనివాస డైరీ ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా విడిసి అధ్యక్షులు శ్రీ తాడూరి సిద్ధ రమేష్ డైరీని ప్రారంభించారు.
ఈ డైరీలో శుద్ధమైన గేదె పాలు, పెరుగు, పన్నీరు, నెయ్యి, పాలకోవా తదితర అన్ని రకాల పాల ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. స్థానిక ప్రజలు స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను పొందేందుకు ఈ డైరీను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
గ్రామస్థులకు నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించడమే లక్ష్యంగా శ్రీనివాస డైరీ ప్రారంభమైందని నిర్వాహకులు తెలిపారు.








