మోర్తాడ్ బాలికల పాఠశాలలో క్రీడా దుస్తులు వితరణ ….

On: Wednesday, October 15, 2025 8:21 AM

 

హైదరాబాద్ పల్స్ న్యూస్ అక్టోబర్ 14, (బాల్కొండ) నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో రాజరాజేశ్వర ఆగ్రో ఏజెన్సీ యజమాని దేవరాజు మంగళవారం క్రీడ దుస్తులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. శారీరక దారుఢ్యం, మానసిక సౌష్టవానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు తమ ప్రతిభను అన్ని రంగాల్లో చాటుకోవాలని కోరారు.

దేవరాజు సుమారు ₹5,000 విలువ గల క్రీడ దుస్తులను విద్యార్థినులకు అందజేశారు. విద్యార్థులు దాతృత్వంతో సహకరించిన దేవరాజుకు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్,వ్యాయామ ఉపాధ్యాయుడు శ్యామ్, ఉపాధ్యాయులు రవీందర్,వినోద్, రాము,అనిత, ఇందిరా,భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

11 Nov 2025

Leave a Comment