పుప్పాలపల్లిలో పోలింగ్ భూతులను పరిశీలించిన ఎస్సై మహేష్…..

On: Friday, November 28, 2025 4:16 PM

 

A9న్యూస్ ప్రతినిధి :

జక్రాన్ పల్లి మండలంలోని పుప్పాపల్లి గ్రామంలో శుక్రవారం ఎస్సై మహేష్ పోలింగ్ భూతులను పరిశీలించారు, పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పుప్పాలపల్లి గ్రామాన్ని సందర్శించారు, ముక్యంగా ఈ ఎన్నికలను స్వేచ్ఛయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడం కోసమే ఈ పర్యటన చేపట్టినట్లు ఎస్సై మహేష్ తెలిపారు, గ్రామ ప్రజలతో సమావేశమై స్థానిక రాజకీయ పరిస్థితులు ఎన్నికల సమయంలో ఏర్పడే సమస్యల వంటి అంశాలపై వివరాలు సేకరించారు,

*ఎస్సై మహేష్ మాట్లాడుతూ….

నామినేషన్ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా శాంతియుతంగా జరగాలని ప్రచారం సమయంలో ఏదైనా వాహనం వాడిన దానికి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని అలాగే ప్రచారానికి ఉన్న సమయంలోనే ప్రచారం చేయాలని, ఎన్నికల సమయంలో ఎలాంటి కేసులు అయినా బైండోవర్ తో పాటు రౌడీ షీట్ వంటి కేసులు అయ్యే అవకాశం ఉందని అన్నారు, ఎన్నికలు పూర్తిగా స్వేచ్ఛయుతంగా జరగాలని ఎవరు ఓటర్లను ప్రభావితం చేయకూడదు డబ్బు,మద్యం,పంపిణి బెదిరింపులు, గుంపులుగా తిరిగి ఉద్రిక్తత సృష్టించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహారిస్తాం అని హెచ్చరించారు…

29 Jul 2026

Leave a Comment