తెలంగాణ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు బైఠాయించిన బిఅర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డి.రాజారాం యాదవ్…
కేసీఆర్ దీక్ష దివాస్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వని తెలంగాణ యూనివర్సిటీ యాజమాన్యం…
డిచ్ పల్లి యూనివర్సిటీ గేటు ముందర దీక్ష శిబిరానికి సంభందించి ఏర్పాటు చేసిన టెంట్ కూల్చి, మైక్ తీసివేయడమే కాకుండా ప్లెక్సీ చించివెత…
ఈ సందర్భంగా రాజారాం యాదవ్ మాట్లాడుతూ కేసిఆర్ గారి దీక్ష దివాస్ కార్యక్రమం శాంతి యుతంగా జరుపుతుంటే మెదట అనుమతి ఇచ్చి, తర్వాత నిరాకరించడం వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని వారు చెప్పారు. కేసీఆర్ గారు 2009 నవంబర్ 29న ఆమరణ నిరహార దీక్షకు కుర్చుంటే అనాటి ప్రభుత్వం ఖమ్మం జైలులో నిర్బందించిందాని, వారు ప్రాణాలు తెగించి డిసెంబర్ 9న ప్రకటనకు కారణం అయ్యారాని, డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే జూన్ 2 తెలంగాణ ఏర్పాటు లేదాని, అట్లాంటి ఉద్యమ చరిత్రని నేటీ భవిష్యత్తు తరాలకు చెప్పటం కోసం ఏర్పాటు చేసుకున్న దీక్ష దివాస్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వక పోవడం సిగ్గు చేటు అని, అప్పటి సమైక్య పాలకులు కూడా ఇలా వ్యవరించలేదాని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ పెద్దలు పీసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఓత్తిడి వల్ల ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదాని రాజారాం యాదవ్ గారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి నిర్బంధాలు విధించిన విద్యార్థుల మరియు నిరుద్యోగుల, ప్రజలు పక్షాన పోరాటం కోనసాగిస్తం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి విసి, రిజిస్టర్ కార్యాలయంలో బైఠాయించిన రాజారాం యాదవ్ తో విద్యార్థి నాయకులు సంతోష్, నాగేంద్ర, నిరంజన్ మరియు బిఅర్ఎస్ నాయకులు కుమార్, లింగం యాదవ్, బొట్టు శ్రీనివాస్ యాదవ్, రాగుల అశోక్ పటేల్, జక్కుల రాజేందర్ యాదవ్, పసులు రాజు తదితరులు పాల్గొన్నారు…








