A9 న్యూస్ ప్రతినిధి :
హకీంపేట గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో మొగిలి గుండ్ల రజిని ప్రభాకర్ సర్పంచ్ పదవికి ఘనంగా నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, యువతతో కలిసి భారీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు.
గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలన, శుద్ధి నీటి సరఫరా, కాల్వల విస్తరణ, మహిళల సంక్షేమం వంటి అంశాలపై పని చేస్తానని రజిని ప్రభాకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. గ్రామ ప్రజల ఆశీర్వాదాలు, సహకారం తనకు బలమని, తమ విజయం ప్రజల విజయం అవుతుందని ఆమె మాట్లాడుతూ నమ్మకం వ్యక్తం చేశారు.
నామినేషన్ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా తమ మద్దతును ప్రకటించారు. హకీంపేట గ్రామంలో ఎన్నికల వేడి మరింత పెరిగింది.








