హైదరాబాద్:నవంబర్10
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు శుభవార్త చెప్పింది, ఈనెల 19న మహిళలకు చీరలు పంపిణీ చెయ్యనున్నట్లు తెలిపింది, దసరా ముందు నుండి మహిళలకు చీరలను పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి పాఠకులకు తెలిసిందే.
దసరా పండుగ నుంచి ఈ చీరల పంపిణీపై అనేక వార్తలు వస్తున్నాయి. బతుకమ్మ పండుగకే చీరల పంపిణీ చేస్తామని ప్రకటించారు. అయితే అప్పుడు కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఈ చీరలను పంపిణీ చేశారు. చాలా మందికి చీరలు పంపిణీ చేయలేదు. ఈక్రమంలో మంత్రి సీతక్కతో సహా పలువురు అధికారులు కూడా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై అనేక పర్యాయాలు ప్రకటన చేశారు.
ఈక్రమంలో తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులందరికీ పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిద్ధమవుతున్నాయని ఆమె ప్రకటించారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీకి రంగం సిద్ధమై నట్లు ఆమె తెలిపింది.. ఇప్పటికే 4.10 కోట్ల మీటర్ల సేకరణ జరిగిందని వారంలో ఉత్పత్తి పూర్తవుతుందని జిల్లా అధికారులు తెలిపారు.








