సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ….

On: Monday, August 18, 2025 2:04 PM

📍 బూరుగుపల్లి, నర్సాపూర్ | ఆగస్టు 18 – A9 న్యూస్:

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హవేలీఘన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడాయి.

ఈ సందర్భంగా సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన చేసిన ధైర్యసాహసపూరిత పోరాటాలను, ముఖ్యంగా మొగలయుల పై చేసిన నిర్భయ యుద్ధాన్ని గుర్తు చేసుకున్నారు. “సర్దార్ పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ప్రతి యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన నాయకత్వం, పరాక్రమం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి,” అని రంజిత్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ హవేలీ ఘనపూర్ మండల కార్యదర్శి సురేందర్ గౌడ్, బూరుగుపల్లి గ్రామ యువకులైన శ్రీనివాస్ గౌడ్, బన్నీ, శ్రీధర్, డాని, రాజు, నందం తదితరులు పాల్గొన్నారు.

21 Jan 2026

Leave a Comment