రుక్మాపూర్ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు ఇసుక పర్మిషన్….

On: Tuesday, October 21, 2025 9:24 PM

పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ కు కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు.

ఎ9 న్యూస్, చేగుంట, అక్టోబర్ 21:

మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పిఎ,సి,ఎస్, చైర్మన్ మేకల పరమేష్ ఇబ్బందులను సమస్యలను తెలుసుకొని ముందుకు వచ్చి నేనున్నాను అని లబ్ధిదారులకు అండగా ఉంటానని వారితో మాట్లాడి అధికారుల దృష్టికి సమస్యలు తెలిపారు. అనంతరం అధికారులు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు వెంటనే సహాయం చేస్తామని  అని పిఎసిఎస్ చైర్మన్ మేకల పరమేష్ అన్నారు. అనంతరం ఎంపీడీవో, ఏఈ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఫ్రీ ఇసుక టోకన్లు అందించడం జరిగిందని తెలిపారు.

11 Nov 2025

Leave a Comment