మెదక్ మున్సిపల్ పట్టణంలో త్వరలో ప్రారంభం కానున్న సాండ్ బజార్….

On: Thursday, December 4, 2025 5:48 PM

 

సాండ్ బజార్ తో ఇసుక అక్రమ రవాణాకు చెక్:జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్…

ఎ9 న్యూస్, మెదక్, డిసెంబర్ 4 :

మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించబడుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు త్వరలో ఇసుక సమస్య తీరబోతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో సాండ్ బజార్ను ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

పట్టణంలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఇసుక సమస్యను పరిష్కరించడానికి, మంచి చవకైన, నాణ్యమైన ఇసుకను ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు అందించడానికి త్వరలోనే సాండ్ బజార్ ప్రారంభిస్తున్నామన్నారు.

సాండ్ బజార్లో ఒక మెట్రిక్ టన్ ఇసుక సుమారుగా 1200 రూపాయలకే లభిస్తుందని,. నూతనంగా ప్రారంభించుకోబోయే సాండ్ బజార్లో 1000 మెట్రిక్ టన్నుల ఇసుక స్టాక్ ఇప్పటికే వచ్చి ఉన్నట్లు తెలిపారు. సౌండ్ బజార్ త్వరగా ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ సాండ్ బజార్ ఏర్పాటైన తర్వాత ఇసుక అక్రమ రవాణా నిర్మూలించగలం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్, లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు.

18 Jan 2026

Leave a Comment