TG: కర్నూలు ట్రావెల్స్ బస్సు దుర్ఘటనపై సీపీ
సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్కరి నిర్లక్ష్యం 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. వీరి కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వండి’ అన్నారు.








