పోచంపాడ్, నవంబర్ 1:
“రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం భాగంగా ఈ రోజు పోచంపాడ్ బస్టాండ్ నుంచి పోచంపాడ్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సుహాసిని, పోలీస్ సిబ్బంది, పోచంపాడ్ స్కూల్ విద్యార్థులు, పీఈటీ సంజీవ్ పాల్గొన్నారు. అలాగే మెండోరా యువత బుట్టడి ప్రమోద్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కళ్యాణ్, చరణ్, అరవింద్, సురేష్, ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.








