నగరంలో రియల్టర్ దారుణ హత్య…

On: Monday, December 8, 2025 11:05 AM

 

హైదరాబాద్:డిసెంబర్ 08

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం దారుణ హత్య చోటు చేసుకుంది. నగరంలో ఓ వ్యక్తిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాచకొండ కమిషనరేట్ జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

హత్యకు గురైంది రియల్టర్ వ్యాపారి వెంకటరత్నంగా పోలీసులు గుర్తించారు. పక్కా పథకం ప్రకారమే వ్యాపారిని హతమార్చి నట్లు పోలీసులు నిర్ధారించారు. వెంకట రత్నం బైక్‌పై వెళ్తుండగా కొందరు వ్యక్తులు అతడిని మరో బైక్‌పై వెంబడించారు.

అదును చూసి అతడిపై కిరాతకంగా దాడి చేశారు. సాకేత్ కాలనీ ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో నడిరోడ్డుపైనే వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం వెంకటరత్నాన్ని బైక్‌పై వెంబడించిన సదరు వ్యక్తులు వేట కత్తితో దాడి చేశారు.

అంతటితో ఆగకుండా రివాల్వర్‌తో షూట్ చేసి నడిరోడ్డుపై దారుణానికి పాల్పడ్డారు. ఒక్కసారిగా తుపాకుల శబ్ధం వినిపడటంతో స్థానికులు భయాందోళనకు గుర య్యారు. వెంకటరత్నాన్ని హతమార్చిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.

వెంటనే ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే ఈ హత్యకు కారణం అయ్యి ఉండొచ్చు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

18 Jan 2026

Leave a Comment