రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు…..

On: Wednesday, August 20, 2025 7:07 PM

 

హైదరాబాద్‌/ఆర్మూర్ టౌన్‌, ఆగస్ట్ 20, 2025:

మాజీ ప్రధాని, భారత ఐటీ విప్లవానికి పునాదులు వేసిన దుర్ధృష్టవశాత్తు మృతిచెందిన మహానేత రాజీవ్ గాంధీ 81వ జయంతిని పురస్కరించుకొని, హైదరాబాద్ గాంధీ భవన్‌లో నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి నేతృత్వం వహించారు. ఆయన, ఇతర నేతలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి గౌరవ నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ, “రాజీవ్ గాంధీ ఐటీ రంగానికి బలమైన పునాదులు వేసిన వ్యక్తి. భారతదేశాన్ని ప్రపంచ దేశాల మధ్య అభివృద్ధి మార్గంలో నడిపించిన దూరదృష్టి గల నాయకుడు. యువతకు ఆయన చిరస్థాయి స్ఫూర్తి. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదే,” అని చెప్పారు.

ఈ వేడుకలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్, నాయకులు పెంట ఇంద్రుడు, పిప్పర సాయిరెడ్డి, మీసాల సుదర్శన్, మోహన్ రావు, ఇసుబ్, మెండు శ్రీకాంత్, భట్టు సాయిరాం, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

13 Jan 2026

Leave a Comment