చింరాజ్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా రాజేండ్ల లావణ్య మురళి ప్రమాణస్వీకారం….

On: Tuesday, December 23, 2025 4:51 AM

 

చింరాజ్‌పల్లి గ్రామ సర్పంచ్‌గా రాజేండ్ల లావణ్య మురళి ఈరోజు అధికారికంగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రజల విశ్వాసంతో ఈ బాధ్యతను చేపట్టిన ఆమె, గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఐదు సంవత్సరాలు తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు బడుగు–బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ పారదర్శక పాలనతో చింరాజ్‌పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొని నూతన సర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

18 Jan 2026

Leave a Comment