విధి నిర్వహణలో త్యాగం చేసిన వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్న ప్రజా ప్రభుత్వం.
దొంగ రియాజ్ ను పట్టుకోడానికి సహకరించిన ఆసిఫ్ కు హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వాలని డీజీపీని కోరిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.
-పోలీస్ అమరవీరుల ప్రతి కుటుంబానికి రూరల్ నియోజకవర్గంలో 200 గజాలు స్థలం ఇప్పించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి.
పోలీసు అంటే సమాజంకి ఒక నమ్మకం,భరోసా,విధి నిర్వహణలో ఒక్కసారి ప్రాణాలు సైతం ఫణంగా పెట్టాల్సి వచ్చిన వెనుకడుగు వేయరని, నెత్తురు చిందిస్తున్న మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని, విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యం అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు, నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ పోలీసు సేవలు మరువలేనివని అన్నారు, గత మూడు రోజుల కిందట సిసిఎఫ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ప్రాణాలకు తెగించి రియాజ్ అనే దొంగను పట్టుకోవడంతో రియాజ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ పై దాడి చేసి చంపడం జరిగిందని ప్రమోద్ కుమార్ ప్రాణాలు తెగించి, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, పోలీస్ శాఖ అప్రమత్తమై 48 గంటల్లో దొంగ రియాజ్ ను పట్టుకోవడం జరిగిందని అన్నారు, దొంగను పట్టుకోడానికి సహకరించి ఆసిఫ్ కు తీవ్ర గాయాలు అవడంతో ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు, పోలీస్ శాఖలో హోంగార్డుగా ఆసిఫ్ కు ఉద్యోగం ఇవ్వాలని డిజిపి శివధర్ రెడ్డి కి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కోరారు, ఈ విషయంపై డిజిపి సానుకూలంగా స్పందించి హోంగార్డ్ ఉద్యోగాం ఇస్తామని హామీ ఇచ్చారు.








