అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు మెరుపు దాడులు…

On: Saturday, August 23, 2025 8:57 PM

 

కమిషనర్ ఆదేశాలతో నిజామాబాద్, ఆర్మూర్,బోధన్ డివిజన్లలో విస్తృత శోధనలు.

నిజామాబాద్:

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం తెల్లవారుజామున నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీసులు అక్రమ వడ్డీ వ్యాపారులపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు.

పోలీసుల దాడుల్లో అనుమతి లేకుండా, రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్న పలువురు ఫైనాన్స్ కార్యాలయాలు, ఇళ్లలో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసిన వివరాలు ఇలా ఉన్నాయి:

నిజామాబాద్:

చెక్కులు: 137 (₹10,14,11,370 విలువ).

ప్రామిసరీ నోట్లు: 170 (₹7,10,73,870 విలువ).

ల్యాండ్ డాక్యుమెంట్లు: 99.

నగదు: ₹1,21,92,750.

ఆర్మూర్:

చెక్కులు: 62 (₹30,36,000 విలువ).

ప్రామిసరీ నోట్లు: 324 (₹4,97,10,000 విలువ).

బాండ్ పేపర్లు: 49 (₹1,85,30,500 విలువ).

ల్యాండ్ డాక్యుమెంట్లు: 05,

బోధన్: ఏవీ లభ్యం కాలేదు.

ఈ సందర్భంగా కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ— “పేద ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని అక్రమ వడ్డీ వ్యాపారం చేసి వారిని ఆర్థికంగా కుంగదీస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

13 Jan 2026

Leave a Comment