A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:
ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ అధికారి సత్యనారాయణ గౌడ్, సిబ్బందితో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ పదార్థాలను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్స్ సహాయంతో ఈ ఆపరేషన్ చేపట్టారు.
ప్రాంగణంలోని ప్రతి మూలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, ప్రయాణికుల లగేజ్‌పై కూడా నివారణాత్మక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎటువంటి పెద్దగా అనైతిక వస్తువులు లేదా నిషేధిత పదార్థాలు రికవర్ కాలేదని అధికారులు తెలిపారు.
ప్రజల భద్రత, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ కోసం ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని ఆర్మూర్ పోలీసులు వెల్లడించారు.








