పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు….

On: Thursday, December 4, 2025 8:35 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి:

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇందల్వాయి చెక్‌పోస్ట్ పర్యవేక్షణ…

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడానికి భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ నేడు ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ఇంటర్-డిస్ట్రిక్ బార్డర్ చెక్‌పోస్ట్‌ను ఆకస్మికంగా పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా కమిషనర్ అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మద్యం, ఆయుధాలు మరియు అనుమానాస్పద వ్యక్తుల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన తనిఖీలు నిర్వహించాలి అని ఆదేశించారు.

ప్రజలు ఎలాంటి ఒత్తిడి లేకుండా, భయభ్రాంతి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసులు అన్ని చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో ఎస్‌ఎస్ టీమ్ ఇన్‌చార్జ్ సాయి కుమార్, రవీందర్ సహా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

18 Jan 2026

Leave a Comment