A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గణేష్ ఉత్సవాల సందర్భంలో మండలి నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. డీజేలు పూర్తిగా నిషేధం, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్లు ఆఫ్ చేయాలని ఆదేశించారు. మండపాల వద్ద విద్యుత్ తీగలు, వర్షపు నీటి కారణంగా జాగ్రత్తలు తీసుకోవాలని, బలవంతపు వసూళ్లకు పాల్పడరాదని హెచ్చరించారు.
మహిళలపై ఈవ్‌టీజింగ్, అసాంఘిక చర్యలు చోటు చేసుకోకుండా చూడాలని, అగ్నిప్రమాదాల నివారణకు నీళ్లు, ఇసుక బకెట్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. నిమజ్జనం రోజున పోలీసులు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించి, క్యూ విధానంలో విగ్రహాలను తరలించాలని సూచించారు.
ప్రజలు ఎటువంటి అనుమానాస్పద సమాచారం గమనించినా వెంటనే డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ (87126-59700) కి సమాచారం ఇవ్వాలని కమిషనర్ తెలిపారు.








