A9 న్యూస్ ప్రతినిధి :
స్థానిక ఎన్నికలు సజావుగా నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాటు చేయాలని పాత నేరస్తులను గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు, ప్రతి పోలింగ్ స్టేషన్ ను సిబ్బంది స్వయంగా పరిశీలించి కనీస వసతులు కల్పించే విధంగా చూడాలని, పోలీస్ స్టేషన్ రికార్డులు,బ్యారక్లూ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులపై తనిఖీలు చేసి ప్రతి కేసు కు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసి నాణ్యమైన దర్యాప్తు చేయాలని సూచించారు, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని ప్రతి దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేసి ఫిర్యాదు దారునికి ఒక కాపీ ఇచ్చి సంతకం తీసుకోవాలని అలా అని రిజిస్టర్ లో కూడా నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ రిసెప్షనిస్టుకు సూచించారు, సైబర్ క్రైమ్ అవగాహన పాఠశాలలు మరియు కళాశాలలో సోషల్ మీడియా ద్వారా అవగాహన నిర్వహించాలని, విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకమై గ్రామ సమస్యలు తీర్చే విధంగా పనిచేయాలని సరిహద్దు ప్రాంతాల్లో పరస్పర సమన్వయం బలపరుచుకోవాలని తెలిపారు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రధాన ప్రదేశాల్లో నిరంతరం నిర్వహించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని యువతతో ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు, సిబ్బంది ఎప్పుడు హెడ్ క్వాటర్స్ యందు అందుబాటులో ఉండే విధంగా ఉండాలని ప్రతి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవాలని ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు ఈ సందర్భంగా జక్రాన్ పల్లి ఎస్సై జి మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.








