భారతీయ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి మరో శుభవార్త. 21వ విడత విడుదలకు అధికారికంగా తేదీ ఖరారైంది. ఈనెల 19వ తేదీన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 2,000 జమ కానున్నట్టు కేంద్రం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు ఈ 21వ విడత నిధులు నేరుగా బదిలీ అవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా ఈ నిధులను విడుదల చేయ నున్నారు.








