బొల్లారం ప్రధాన రహదారి ముంపు నుండి విముక్తి కల్పించండి : ఆనంద్ కృష్ణారెడ్డి వినతి….. 

On: Saturday, September 20, 2025 8:06 AM

గత కొన్నేళ్లుగా ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి ముంపుకు గురై ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బొల్లారం బిజెపి పట్టణ అధ్యక్షుడు కేజెఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఐడిఎ బొల్లారం నుంచి బొల్లారం పట్టణంలోకి ప్రవేశించడానికి వాడుకునే ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి నీరు నిలిచిపోయి ఆ రహదారి గుండా రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా వివిధ పరిశ్రమలకు విధులకు హాజరు కావడం కోసం మహిళలు, పురుషులు నడుచుకుంటూ వెళ్ళుతుంటారని, అలా విధులకు వెళ్తున్న వారు నీరు నిలిచిపోయి ఉండడం వలన, మరియు వాహనాలు ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పెడుతున్నారని ఆయన చెప్పారు. పరిశ్రమలు,ప్రజల నుంచి పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేస్తున్నా ప్రజలకు అత్యంత అవసరమైన రహదారిని సక్రమంగా నిర్మించడంలో అధికారులు విఫలమౌతుండడం పట్ల ఒకింత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణం ముంపుకు గురైన రహదారి పనులు పూర్తి చేసి ప్రజలను ఇబ్బందులు నుంచి కాపాడాలని ఆయన మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకపోతే తమ బిజెపి పార్టీ తరపున మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

19 Jul 2026

Leave a Comment