*మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం.
*మెదక్ ఎంపీ వకీల్ సాబ్ హామీ.
🗓️ సెప్టెంబర్ 14 | మాసాయిపేట | ఎ9 న్యూస్:
మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును మాసాయిపేట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ చిన్నచౌదరి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. మాసాయిపేట మండల అభివృద్ధి కోసం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాల్సిందిగా వారు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పాపన్నగారి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు గుండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానంగా అండర్‌గ్రౌండ్ బ్రిడ్జ్ వద్ద నీటి నిల్వ సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా, ఎంపీ రఘునందన్ రావు సానుకూలంగా స్పందించారు. సమస్యపై రైల్వే జీఎంను సంప్రదించామని, త్వరలోనే ఈ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే జాతీయ రహదారి – చేట్లతిమ్మాయిపల్లి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం, మాసాయిపేట సర్వీస్ రోడ్ల అభివృద్ధి అంశాలను కూడా ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, “ఈ సమస్యల పరిష్కార బాధ్యత నాది. త్వరలోనే వాటిని పూర్తి చేస్తాము,” అని హామీ ఇచ్చారు.
మాసాయిపేట మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, “గ్రామ ప్రజల తరఫున ఎంపీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని పేర్కొన్నారు.








