A9 న్యూస్ ప్రతినిధి ధర్పల్లి:
జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం భాగంగా ధర్పల్లి మండలంలో పోలీసులు ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొని హెల్మెట్ ధరించిన వారికి గులాబీ పూలు, నియమాలు పాటించని వారికి ట్రాఫిక్ స్టికర్లు అందించారు.
రోడ్డు పైన ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబసభ్యులు ఎదురుచూస్తుంటారని గుర్తుంచుకొని భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్సై కళ్యాణి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే జాగ్రత్తే మంత్రం అని ఆమె అన్నారు.








