Oct 31, 2025,
మొంథా తుఫాన్ ధాటికి వరంగల్, హనుమకొండ నగరాలు అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షం, ఈదురుగాలులకు వందలాది కాలనీలు, ఇళ్లు నీట మునిగాయి. ఎగువ గొలుసుకట్టు చెరువుల వరదనీరంతా సిటీవైపు ప్రవహించడంతో పరిస్థితి మరింత దిగజారింది. కేయూ 100 ఫీట్ల రోడ్డు కాలనీల్లో ఊర చెరువు బీభత్సం సృష్టించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తుఫాన్ ధాటికి వరంగల్, హనుమకొండలో ముగ్గురు మృతి చెందారు.








