పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల సందర్భంగా ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహణ – కమిషనర్ పి. సాయి చైతన్య….

On: Thursday, October 30, 2025 8:22 PM

 

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల భాగంగా ఆన్లైన్ ఓపెన్ హౌజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగింది.

ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులకు పోలీస్ శాఖ పనితీరు, సేవల గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. ముఖ్యంగా —

🔹 రిసెప్షన్ కౌంటర్ నిర్వహణ విధానం

🔹 సి.సి.టి.ఎన్.ఎస్ వ్యవస్థ పనితీరు

🔹 ఫిర్యాదు స్వీకరణ విధానం మరియు దర్యాప్తు ప్రక్రియ

🔹 ఎఫ్‌.ఐ.ఆర్. నమోదు మరియు కాపీ పొందే విధానం

🔹 డయల్ 100 సేవల పనితీరు

🔹 పెట్రోకార్ వ్యవస్థ పాత్ర

🔹 నేరస్తుల వివరాల సేకరణ మరియు భద్రపరిచే విధానం

🔹 పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ

🔹 వాహనాల తనిఖీలు మరియు భద్రతా చర్యలు

🔹 పోలీస్ సిబ్బంది విధులు, కమ్యూనికేషన్ విభాగాల పనితీరు

ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు పోలీస్ శాఖ పనితీరుపై అవగాహన పొందడంతో పాటు, పోలీస్ – ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని అధికారులు తెలిపారు.

11 Nov 2025

Leave a Comment