హైదరాబాద్:సెప్టెంబర్ 20
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 7,267 టీచర్, నాన్ టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచే ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.
*పోస్టుల వివరాలు:
ప్రిన్సిపల్ పోస్టుల సంఖ్య: 225
పీజీటీ పోస్టుల సంఖ్య: 1,460
హాస్టల్ వార్డెన్ (మేల్) పోస్టుల సంఖ్య: 346
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్) పోస్టుల సంఖ్య: 228
అకౌంటెంట్ పోస్టుల సంఖ్య: 61
స్టాఫ్ నర్స్ (ఫీమేల్) పోస్టుల సంఖ్య: 550
టీజీటీ పోస్టుల సంఖ్య: 3,962
హాస్టల్ వార్డెన్ (ఫీమేల్) పోస్టుల సంఖ్య: 289
ల్యాబ్ అటెండెంట్ పోస్టుల సంఖ్య: 146
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమాలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు, పీజీటీకి 40 ఏళ్లు, టీజీటీకి 35 ఏళ్లు, అకౌంటెంట్‌కు 30 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్‌కు 30 ఏళ్లు, హాస్టల్ వార్డెన్, ఫీమేల్ స్టాఫ్ నర్స్‌కు 35 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అటెండెంట్‌కు 30 ఏళ్లుగా నిర్ణయించారు.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ ఆధారంగా అక్టోబర్ 23, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జన రల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిన్సిపల్ పోస్టుకు రూ.2,500, టీజీటీ, పీజీటీ పోస్టులకు రూ.2,000, నాన్-టీచింగ్ పోస్టులకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.
ఉద్యోగ నోటిఫికేషన్లు:
ఆయా పోస్టులకు నెల జీతం ఎలా ఉంటుందంటే..
ప్రిన్సిపల్ పోస్టులకు రూ.78,800 నుంచి రూ.2,09,200 వరకు
పీజీటీ పోస్టులకు రూ.47,600 నుంచి రూ.1,51,100 వరకు….
టీజీటీ పోస్టులకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు,
అకౌంటెంట్ పోస్టులకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు,
ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు,
హాస్టల్ వార్డెన్ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు,
ఫీమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.29,200 నుంచి రూ.92,300 వరకు,
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.







