హైదరాబాద్:డిసెంబర్ 04
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చాక యువత ఆకాంక్షలను గుర్తించి 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని త్వరలోనే 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, ప్రకటించారు.రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు.
కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలన పూర్తయ్యేసరికి లక్ష ఉద్యోగాల మార్క్‌ను అందుకుంటామని చెప్పారు. విద్య, నీటిపారుదలపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. ఈ మేరకు ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. బహుజన సామ్రాజ్యం కోసం సర్దార్ సర్వాయి పాపన్న పునా దులు వేశారన్న సీఎం.. 2001లో హుస్నాబాద్ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైందని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004న కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటను.. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నిలబెట్టు కున్నారన్నారు.
దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్పూర్తితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తోంద న్నారు. హుస్నాబాద్ అంటే తనకు సెంటిమెంట్ అని మాజీ సీఎం కేసీఆర్ చెబు తారని.. కానీ బీఆర్ఎస్ పాలనలో హుస్నాబాద్ నిర్లక్ష్యం చేశారన్నారు. ఈ ప్రాంతంలోని కుండపల్లి, గౌరెల్లి రిజర్వాయర్లు పూర్తి చేసే బాధ్యత తనదే అని సీఎం రేవంత్ చెప్పారు.








