నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభం – డిజిపి బి. శివధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం…

On: Friday, January 23, 2026 7:27 PM

 

A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:

తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డిజిపి) బి. శివధర్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించి, నూతనంగా నిర్మించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని అధికారికంగా ప్రారంభించారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా టాటా ఏఐజీ (TATA AIG) ఇన్సూరెన్స్ సంస్థ అందించిన ₹17 లక్షల ఆర్థిక సహకారంతో ఈ ఆధునిక పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం పూర్తయింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిజిపి బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ… శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు కీలకమని పేర్కొన్నారు. టాటా ఏఐజీ సంస్థ అందించిన సహకారం పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుందని ఆయన అభినందించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గారు మాట్లాడుతూ… పోలీస్–ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించేందుకు ఇటువంటి ఆధునిక భవనాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. అలాగే మహిళా పోలీసులకు మెరుగైన వసతులు కల్పించడంలో ఈ పోలీస్ స్టేషన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమం పోలీస్ శాఖకు మరింత బలాన్ని చేకూర్చడమే కాకుండా, ప్రజలకు త్వరితగతిన మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

15 Feb 2026

Leave a Comment