నవంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్….

On: Thursday, October 30, 2025 6:17 PM

 

హైదరాబాద్:అక్టోబర్ 30

ఆధార్ సంస్థ నవంబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అమలు చేయనుంది. ఇందులో భాగంగా ఇంటి నుంచే ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ సెంటర్ల వద్ద గంటల తరబడి క్యూలో నిల్చొనే పని లేకుండా ఆధార్ అప్డేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్.. ఇలా ప్రతిదీ ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. దీంతోపాటు మరికొన్ని కొత్త రూల్స్…

గవర్నమెంట్ ఐడీ ఉపయోగించి..

ఆధార్ లో ఏవైనా కరెక్షన్స్ చేసుకోవాలంటే.. దానికోసం మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు, మొత్తం ప్రక్రియ ను ఆన్‌లైన్‌లో చేయవచ్చు. కార్డుదారులు తమ వివరాలు మార్చుకోవడం కోసం ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఉపయోగించా ల్సి ఉంటుంది. పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, జనన ధృవీకరణ పత్రం వంటి అధికారిక ప్రభుత్వ పత్రాలు సాయంతో మీరు మీ ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకోవచ్చు. అలాగే అప్ డేట్ ఛార్జీలు కూడా కొన్ని మారనున్నాయి..

పేరు, చిరునామా లేదా మొబైల్ నంబర్‌ అప్ డేట్ కి రూ. 75 రుసుం చెల్లించి సేవలను వినియోగించుకో వచ్చు..నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డుని ఆధార్ కార్డుతో లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ డిసెంబర్ 31, 2025 కల్లా పూర్తి చేయాలి. ఒకవేళ లింక్ చేయకపోతే జనవరి 1, 2026 నుండి పాన్ కార్డ్ చెల్లదు.

*ఈజీ కేవైసీ…

నవంబర్ 1 నుంచి కేవైసీ ప్రాసెస్ చాలా ఈజీ అవ్వనుంది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు కెవైసీ(KYC) చేయడానికి ఇక నుంచి ఆధార్ నెంబర్ సరిపోతుంది. ఆధార్ నెంబర్ ఉపయోగించి ఓటీపీ ద్వారా ధృవీకరించి కెవైసీ పూర్తి చేయొచ్చు. అలాగే వీడియో కన్ఫర్మేషన్ లేదా ఫేస్ టు ఫేస్ వెరిఫికేషన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు.

11 Nov 2025

Leave a Comment