నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో నూతన మార్పులు*…..

On: Monday, October 27, 2025 12:13 PM

 

హైదరాబాద్:అక్టోబర్ 27

బ్యాంకుల్లో ఖాతాదారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి చెక్ పడనుంది,ఇప్పటివరకు బ్యాంకు ఖాతాదారుడికి జరగరానిది ఏమైనా జరిగితే వారసులు ఆ ఖాతా సెటిల్ చేసుకోవడం పెద్ద సమస్యగా ఉండేది, లాకర్ల వస్తువుల సెటి ల్మెంటులోనూ ఇదే సమస్య అయితే నవంబరు ఒక్కటి నుంచి ఈ కష్టాలకు తెరపడనుంది…..

బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం 2025 కింద కొత్త మార్గదర్శకాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజా ప్రకటించింది. బ్యాంక్ డిపా జిట్ ఖాతాలు, లాకర్లకు నామినేషన్స్‌, సెఫ్ కస్టడీ లోని ఆస్తులపై కస్టమర్లకు నియంత్రణ, సౌలభ్యాన్ని కల్పించేందుకు కీలక మా ర్పులు జరుగుతున్నాయి.

ఈ కొత్త మార్గదర్శకాలు నవంబర్ 1, 2025 నుంచే అమలులోకి వస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలి పింది.డిపాజిట్ అకౌంట్లు, సేఫ్ కస్టడీ వస్తువులు, సెఫ్టీ లాకర్స్ వంటి వాటికి సంబంధించిన నామినేషన్ ఎంపికలో కీలక మార్పులు వస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం 2025లోని సెక్షన్లు 10,11,12,13 కింద ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1, 2025 నుంచే అమలవుతాయి. బ్యాంకింగ్ లాస్ సవరణ చట్టం 2025ని గత ఏప్రిల్ 15, 2025 రోజునే కేంద్రం నోటిఫై చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1935, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ చట్టం 1949, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1955, బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970లో మొత్తం 19 సవరణలు చేసిందని తెలిపింది.

11 Nov 2025

Leave a Comment