నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి పరామర్శ….

On: Friday, September 12, 2025 1:24 PM

ఎ9 న్యూస్, మాసాయిపేట ,సెప్టెంబర్12 :

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇటీవల మాసాయిపేట గ్రామంలో మరణించిన కుక్కదువ్వు అంజయ్య, శేషుని బాలమణి, శివంపేట పోచమ్మ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే మాసాయిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోడూరి జగదీష్ గౌడ్ తండ్రి కిష్ట గౌడ్ అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో వారిని కలసి, పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ నర్సింలు, మాజీ ఉపసర్పంచ్ ఊదండపురం నాగరాజు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండారం శీను, అలాగే నాయకులు దశరథ్, వెంకటేష్, లక్ష్మణ్, శంకర్, రమేష్, బాలేష్, శ్రీనివాస్, ప్రకాష్, గ్యాస్ రాజు, పవన్ తదితరులు పాల్గొన్నారు.

21 Jan 2026

Leave a Comment