ఏసీబీకి పట్టుబడ్డ ఎమ్మార్వో….

On: Friday, October 10, 2025 10:53 AM

 

నల్గొండ జిల్లా, అక్టోబర్ 10 :

నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ కీ చిక్కాడు,నల్గొండ జిల్లా చిట్యాల మండల కార్యాలయంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహిస్తున్న కృష్ణ, రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు చిట్యాల ఎమ్మార్వో కార్యాలయంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… భూమికి సంబంధించిన పని పూర్తి చేయడానికి ఓ రైతు నుంచి 2 లక్షల రూపాయలు ఎమ్మార్వో కృష్ణ డిమాండ్ చేయగా… అంత డబ్బు నేను ఇవ్వలేను అని రైతు వేడుకున్నా కనికరం చూపించని లంచగొండి అధికారి డబ్బు ఇవ్వకుండా ఫైల్‌ను ముందుకు కదలని వ్వనని స్పష్టం చేశాడు.

అధికారి వేధింపులను భరించలేని బాధితుడు.. ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు.రైతు ఇచ్చిన పక్కా సమాచారం ఆధారంగా.. ఏసీబీ బృందం వ్యూహాత్మకంగా రంగంలోకి దిగింది. ఎమ్మార్వో కృష్ణ కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి చేసి ఎమ్మార్వో కృష్ణను పట్టుకున్నారు.

అధికార దుర్వినియోగానికి పాల్పడిన కృష్ణను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఎమ్మార్వో కృష్ణపై గతంలోనూ అనేక అక్రమ ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మార్వో తన పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డాడనే సమాచారం తో గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.

08 Nov 2025

Leave a Comment