ఆర్మూర్ మినీ స్టేడియం వద్ద కనబడిన మిస్సింగ్ పాప – వివరాలు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి….

On: Thursday, November 27, 2025 4:07 PM

 

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్ ప్రతినిధి:

ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియం వద్ద ఒక చిన్నారి ఒంటరిగా తిరుగుతుండగా స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చారు. పాపను వివరాలు అడిగినప్పటికీ ఆమె ఏమీ చెప్పలేకపోతుందని పోలీసు అధికారులు తెలిపారు.

పాప గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సీఐ సత్యనారాయణ కోరారు.

సంప్రదించవలసిన నంబర్: 8712659752, 8712659858.

16 Dec 2025

Leave a Comment