హల్దీ వాగు వద్ద పరిస్థితిని పరిశీలించిన మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్….

On: Monday, August 18, 2025 1:26 PM

 

తూప్రాన్, మెదక్ జిల్లా – ఆగస్టు 18:

తూప్రాన్ మండలం కిష్టాపూర్ – గుండ్రెడ్డిపల్లి వెళ్లే రహదారిపై ఉన్న హల్దీ వాగు వద్ద వరద పరిస్థితిని ఈ రోజు మెదక్ జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ ప్రత్యక్షంగా పరిశీలించారు. వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో రహదారిపై ప్రభావం ఎలా ఉందో తెలుసుకునేందుకు కలెక్టర్ అక్కడికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యం. హల్దీ వాగు వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన చోటునుంచి ట్రాఫిక్ దారి మళ్లింపులు, రహదారి మరమ్మత్తులు చేపట్టేలా అధికారులక ఇప్పటికే సూచనలు ఇచ్చాం,” అని తెలిపారు.

అధికారులతో కలిసి కలెక్టర్ పరిస్థితిని సమీక్షించి, భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

21 Jan 2026

Leave a Comment