మహా నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు…..

On: Thursday, September 4, 2025 3:25 PM

 

శోభాయాత్ర ఏర్పాట్లు: బాలాపూర్‌ గణేశుడి దర్శనంతో ప్రారంభమై, చార్మినార్, మొజంజాహి మార్కెట్, తెలుగు తల్లి వంతెన మార్గంలో హుస్సేన్‌సాగర్‌ వరకు శోభాయాత్ర కొనసాగనుంది.

బందోబస్తు: శాంతియుత నిమజ్జనం కోసం 30 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు – సీపీ సీవీ ఆనంద్‌.

క్షేత్రస్థాయి పరిశీలన: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌, కలెక్టర్‌ హరిచందన, పోలీస్‌ కమిషనర్లు మార్గాన్ని పరిశీలించారు.

విగ్రహాల నిమజ్జనం: సెప్టెంబరు 2వ తేదీ వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో 1,21,905 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది.

అత్యధికంగా కూకట్‌పల్లిలో – 41,000+

అత్యల్పంగా చార్మినార్‌లో – 6,254.

వాహనాల ఏర్పాటు: నిమజ్జన వాహనాల కోసం RTA 1500కుపైగా అభ్యర్థనలు అందుకుంది. అద్దె ధరలు ₹1,000 – ₹33,000 మధ్య ఉన్నాయి.

అమిత్‌ షా హాజరు: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నిమజ్జనోత్సవానికి హాజరుకానున్నారు – గణేష్‌ ఉత్సవ సమితి కార్యదర్శి డా. రావినూతల శశిధర్‌ వెల్లడి.

15 Feb 2026

Leave a Comment