వైన్స్‌ షాప్‌లో వ్యక్తి మృతి…..

On: Sunday, October 26, 2025 12:31 PM

 

మెదక్ జిల్లా, అక్టోబర్ 26:

చిన్న శంకరంపేట్ మండలం ఆర్.గవలపల్లి ఎక్స్‌ రోడ్‌లో ఉన్న శ్రీ రేణుక మాత వైన్స్ పర్మిట్ షాప్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబాజీపేటకు చెందిన వెంకటేష్‌ (36) అనే వ్యక్తి, వృత్తిరీత్యా డ్రైవర్‌గా పనిచేస్తూ, నిన్న సాయంత్రం మద్యం కొనుగోలు చేసి తాగిన కొద్ది సేపటికే అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న శంకరంపేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శంకరంపేట్ ఎస్‌ఐ ఐ. నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

11 Nov 2025

Leave a Comment