A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
వేల్పూరు మండలంలో గ్రంథాలయ పితామహుడు, ఆధునిక గ్రంథాలయ శాస్త్రానికి పునాదులు వేసిన మహనీయుడు ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జరుపుకునే ఈ దినోత్సవంలో ఆయన భారతదేశంలో పుస్తక భాండాగారాల అభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందించడంలో, పుస్తకాలను అందరికీ చేరువ చేయడంలో ఆయన పాత్ర విశేషమైందని పాల్గొన్నవారు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ కొమ్ము శ్వేత, కంప్యూటర్ ఆపరేటర్, నరసయ్య, సిబ్బంది శ్రీజ, పాఠకులు పాల్గొన్నారు.







